- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఎన్నికల ఫలితాల వేళ మార్కెట్ల ర్యాలీ
ప్రధానంగా ఎన్నికల ఫలితాల ధోరణులపై ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ కనిపించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాల్లో ర్యాలీ చేశాయి. ప్రధానంగా ఎన్నికల ఫలితాల ధోరణులపై ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ కనిపించింది. ఇదే సమయంలో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు స్థిరమైన ఆదాయాలను వెల్లడిస్తుండటం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధించడంతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు మారడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అయితే, బలహీనపడుతున్న రూపాయి, పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా 1,000 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన తర్వాత లాభాలు నెమ్మదించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 355.90 పాయింట్లు లాభపడి 77,269 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు పెరిగి 24,119 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.17 వద్ద కొత్త రికార్డు పతనాన్ని నమోదు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో కొత్త పార్టీ, సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ గెలిచింది. అధికార డీఎంకే ఓటమితో ఆ పార్టీ అధినేత స్టాలిన్ బంధువు కళానిధి మారన్‌కు చెందిన సన్‌టీవీ షేర్ ధరలు దాదాపు 6 శాతం వరకు క్షీణించాయి.






