లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 14 |
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి లాభాల్లోకి మారాయి. సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు ఉదయం ప్రారంభంలో ప్రతికూలంగా మొదలైనప్పటికీ ఆ తర్వాత లాభాల్లో ర్యాలీ చేశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ పరిణామాల మద్దతుతో మార్కెట్లు రాణించాయి. అమెరికాలో రుణ పరిమితికి సంబంధించిన వ్యవహారం కారణంగా ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. మరోవైపు దేశీయ కీలక రిలయన్స్, ఐటీ వంటి షేర్లలో కొనుగోళ్లు పెరగడం, ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లలో భారీ ర్యాలీ కూడా స్టాక్ మార్కెట్లు పుంజుకునేందుకు కారణమయ్యాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు ఎగసి 61,963 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 18,314 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు భారీ కొనుగోళ్లతో ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, ఐటీసీ కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.86 వద్ద ఉంది.Next Story

Most Viewed