మూడు రోజుల లాభాలకు బ్రేక్!

by Disha Web Desk 17 |
మూడు రోజుల లాభాలకు బ్రేక్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే ప్రతికూలంగా మొదలైన సూచీలు మిడ్-సెషన్‌కు ముందు కొద్దిసేపు లాభాల్లోకి మారాయి. అమ్మకాల ఒత్తిడితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావం కారణంగా తిరిగి పడిపోయాయి.

అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక విడుదలకు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దేశీయంగా కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ సహా పలు సంస్థల షేర్లలో అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 208.01 పాయింట్లు క్షీణించి 61,773 వద్ద, నిఫ్టీ 62.60 పాయింట్లు నష్టపోయి 18,285 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రాణించగా, మెటల్, ఫైనాన్స్ రంగాలు నీరసించాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకి కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.70 వద్ద ఉంది.

Also Read..

ఒక్కరోజులో $4.38 బిలియన్ల సంపద.. తిరిగి టాప్ 20 బిలియనీర్ల జాబితాలోకి అదానీ


Next Story