- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: తిరిగి 25,000 మార్కు దాటిన నిఫ్టీ
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ కారణాలతో సూచీలు సోమవారం ట్రేడింగ్ రోజంతా సానుకూలంగా ర్యాలీ చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను సాధించాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ కారణాలతో సూచీలు సోమవారం ట్రేడింగ్ రోజంతా సానుకూలంగా ర్యాలీ చేశాయి. ప్రధానంగా యూరోపియన్ యూనియన్‌పై అదనపు సుంకాల అమలు మరింత ఆలస్యం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. ఇదే సమయంలో అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడటం, దేశీయంగా రుతుపవనాలు తొందరగా మొదలవడం, బాండ్ల రాబడిపై సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు రాణించడంతో మన మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే నిఫ్టీ తిరిగి 25,000 మార్కును అధిగమించింది. వీటికి తోడు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి జీడీపీ డేటాపై అంచనాలు పెరగడం, కంపెనీల త్రైమాసిక ఫలితాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మెరుగు పడటం, ఐటీ, మెటల్, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు మార్కెట్లలో ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 455.37 పాయింట్లు ఎగసి 82,176 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25,001 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎటర్నల్(జొమాటో) అత్యధికంగా 4.51 శాతం కుదేలవగా, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.11 వద్ద ఉంది.






