- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: పెరుగుతున్న సైబర్ నేరాలు, స్పామ్ కాల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసుల జారీ
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై నోటీసులు జారీ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, స్పామ్ కాల్స్‌పై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు బుధవారం కేంద్రం నుంచి ప్రతిస్పందనను కోరింది. ప్రభుత్వ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయనే అంశాన్ని ప్రస్తావించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ఈ వ్యవహారంపై నోటీసులు జారీ చేసింది. బెంగుళూరు నివాసి గౌరీశంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో.. పెరుగుతున్న సైబర్ క్రైమ్, స్పామ్ ఫోన్ కాల్స్‌ను ప్రధానంగా చూపుతూ, సామాన్యులు, బ్యాంకులు, కీలక అధికారులపై దీని ప్రభావాన్ని వివరించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ (సీఎన్ఏపీ)ల వద్ద సైబర్ క్రైమ్‌ను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దేశంలో దాని అమలుకు సరైన రోడ్‌మ్యాప్ లేదని వివరించింది. కానీ, సమస్యను అర్థం చేసుకున్నాం. దీనిపై కేంద్రం నుంచి స్పందన అవసరమని కోర్టు పేర్కొంది.






