జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి 15.7 శాతం: ఎస్‌బీఐ ఎకోరాప్!

by Disha Web Desk 7 |
జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి 15.7 శాతం: ఎస్‌బీఐ ఎకోరాప్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి బేస్ ఎఫెక్ట్, కరోనా సడలింపులతో 15.7 శాతంగా అంచనా వేస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాలు, అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ప్రపంచ వాణిజ్యంపై పడుతున్న ప్రభావం కారణంగా డిమాండ్ కొంత మందగించినప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ పురోగతి మెరుగ్గా ఉందని తెలిపింది.

ప్రభుత్వం బుధవారం 2022-23 మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఈ అంచనాను విడుదల చేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా భారీగా క్షీణించిన ప్రైవేట్ వినియోగం 46 శాతం మేర కోలుకుంది. వినియోగదారు డిమాండ్ గణనీయంగా పుంజుకున్న ధోరణి కనిపిస్తోందని, ప్రధానంగా సేవల రంగంలో మెరుగైన గణాంకాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. కాగా, ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా సైతం ప్రస్తుత ఆర్థిక సంవతరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 13 శాతంతో రెండంకెల స్థాయిలో వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఇది ముఖ్యంగా బేస్ ఎఫెక్ట్, కరోనా వ్యాక్సిన్ పురోగతి, సేవల రంగం పునరుద్ధరణ కారణంగా నమోదవుతుందని ఇక్రా వెల్లడించింది.


Next Story

Most Viewed