- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI: వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
దీనివల్ల ఇప్పుడున్న, కొత్త రుణగ్రహీతలకు రుణాలు చౌకగా మారుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలు తగ్గనున్నాయి. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు అందుకనుగుణంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రుణాలపై వడ్డీని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇప్పుడున్న, కొత్త రుణగ్రహీతలకు రుణాలు చౌకగా మారుతాయి. ఎస్‌బీఐ తన రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణ రేట్లు 7.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్)ను కూడా 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. సవరించిన రేట్లు జూన్ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. వీటితో పాటు ఎస్‌బీఐ తన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను కూడా 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. సవరిచిన రేట్ల ప్రకారం, 1-2 ఏళ్ల కాలానికి 6.30 శాతానికి, 5-10 ఏళ్ల కాలానికి 6.05 శాతానికి తగ్గించింది. ప్రత్యేక ఎఫ్‌డీ 444 రోజుల కాలవ్యవధి కలిగిన అమృత్ వృష్టి ఎఫ్‌డీ పథకంపై వడ్డీ రేటును 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లపైనా ఎస్‌బీఐ వడ్డీ రేట్లను కుదించింది. ఇకపై సేవింగ్స్ అకౌంట్లలో ఉండే మొత్తంపై వడ్డీ 2.5 శాతమే లభిస్తుంది.






