- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Banks: ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం కొత్త డొమైన్‌లను తెచ్చిన బ్యాంకులు
సైబర్ మోసాలను నిలువరించి డిజిటల్ లావాదేవీల్లో భద్రతను పెంచాలనే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లకు సంబంధించి డొమైన్‌లలో మార్పులు చేశాయి. బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ అడ్రస్‌లను అక్టోబర్ 31లోపు ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ 'బ్యాంక్.ఇన్'కి మార్చాలని ఏప్రిల్ 21న భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సర్క్యులర్ జారీ చేసింది. సైబర్ మోసాలను నిలువరించి డిజిటల్ లావాదేవీల్లో భద్రతను పెంచాలనే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త డొమైన్‌లను అక్టోబర్ 31 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త డొమైన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీని ద్వారా హ్యాకింగ్, ఫిషింగ్ లాంటి సైబర్ మోసాలను కట్టడి చేయవచ్చని, ఆర్థిక సేవల విషయంలో ప్రజలకు మరింత రక్షణ అందించడమే లక్ష్యమని ఆర్‌బీఐ చెబుతోంది. భవిష్యత్తులో ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేకంగా 'ఫిన్.ఇన్' డొమైన్ తెచ్చే ఆలోచన కూడా ఉందని ఆర్‌బీఐ గత ప్రకటనలో పేర్కొంది.






