SBI: ఎస్‌బీఐకి రూ.6,337 కోట్ల పన్ను నోటీసులు

by S Gopi |

అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

SBI: ఎస్‌బీఐకి రూ.6,337 కోట్ల పన్ను నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ పన్ను నోటీసులను అందుకుంది. 2023-24 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి రూ. 6,337 కోట్ల(వడ్డీతో సహా) పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకున్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు తన పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తక్కువగా చూపించిందని ఆదాయపు పన్ను శాఖ అభిప్రాయ పడింది. అయితే, పన్ను నిబంధనల ప్రకారమే మినహాయింపులు లెక్కంచినట్టు ఎస్‌బీఐ చెబుతోంది. వివిధ కారణాలపై అసెస్‌మెంట్ యూనిట్ చేసిన తిరస్కరణల కారణంగా ఈ పన్ను డిమాండ్ తలెత్తింది. నిర్ణీత కాలవ్యవధిలోగా అప్పీలేట్ అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేయడంతో సహా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ ఉత్తర్వుల కారణంగా బ్యాంకు కార్యకలాపాలపై గానీ, ఇతర సేవలపై గానీ ఎలాంటి ప్రభావం ఉండవని ఎస్‌బీఐ పేర్కొంది.

Next Story