SBI: అకౌంట్‌లో నుంచి రూ.236 కట్ అయ్యింది.. వెంటనే బీపీ పెరిగింది.. కానీ అసలు మ్యాటర్‌ తెలిస్తే

by Vennela |   (  Updated:2025-01-22 06:01:00  IST  )

SBI Account: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్(SBI Account) ఉందా?అందులో నుంచి రూ. 238 కట్ అయ్యిందని టెన్షన్ పడుతున్నారా?

SBI: అకౌంట్‌లో నుంచి రూ.236 కట్ అయ్యింది.. వెంటనే బీపీ పెరిగింది.. కానీ అసలు మ్యాటర్‌ తెలిస్తే
X

దిశ, వెబ్‌డెస్క్: SBI Account: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్(SBI Account) ఉందా?అందులో నుంచి రూ. 238 కట్ అయ్యిందని టెన్షన్ పడుతున్నారా? అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈడబ్బులు కట్ అవుతుంటాయి. ఎస్బిఐ(SBI) సుమారు 50కోట్లకు పైగా కస్టమర్లకు సేవలను అందిస్తోంది. యోనో మొబైల్ యాప్(YONO Mobile App) ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా ఎస్బిఐ తన యూజర్లకు ఆధునాతనమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందిస్తుంది.

ఎస్బిఐ(SBI) ఖాతాదారులను ఏటీఎమ్(ATM) కార్డులుగా డెబిట్ కార్డులను అందిస్తుంది. ఈ కార్డులను వినియోగదారులను ఏటీఎమ్ ల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు షాపింగ్ కోసం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్(Online transactions) చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు అలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 236 డెబిట్ చేసినట్లు మెసేజ్ వస్తుంది. యాన్యువల్ మెయింటెనెన్స్(Annual Maintenance) ఛార్జీల కింద ఈ డబ్బులు కట్ అవుతున్నాయి.

మీరు ఎస్బిఐ పాస్ బుక్(SBI Passbook) ను పరిశీలించినట్లయితే ఈ విషయం అందులో స్పష్టంగా ఉంటుంది. మీరు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ, సర్వీస్ ఛార్జీ కింద మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటారు. ఈ కార్డుల కోసం బ్యాంకు వార్షిక నిర్వహణ ఫీజు రూ. 200 వసూలు చేస్తుంది. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఫీజు రూ. 200తోపాటు జీఎస్టీ 18శాతం అంటే మొత్తం 236 రూపాయలు కట్ అవుతాయి. 200 ప్లస్ 18శాతం జీఎస్టీ మొత్తం 236 కట్ అవుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యూజర్లకు పలు రకాల డెబిట్ కార్డులను అందిస్తుంది. యువ(Yuva), గోల్డ్(Gold), కాంబో(Combo), మై కార్డ్(My Card) డెబిట్ కార్డ్ ఛార్జీలు 250ప్లస్, 18శాతం జీఎస్టీ. ప్లాటీనం డెబిట్ కార్డ్ 325 ప్లస్ జీఎస్ట్ కట్ అవుతుంది. ప్రైడ్ ప్రీమియం(Pride Premium) డెబిట్ కార్డుల 425 ప్లస్ 18శాతం జీఎస్టీ కట్ అవుతుంది. ప్లాటీనం బిజినెస్ రూపే కార్డు(Platinum Business RuPay Card) 350 ప్లస్ 18శాతం జీఎస్టీగా ఉంటుంది.

ఎస్బిఐ అనేక విధాలుగా సేవలను అందిస్తుంది. యోనో మొబైల్ యాప్(YONO Mobile App) ద్వారా కస్టమర్లు తమ బ్యాంకింగ్, లోన్, ఇన్సూరెన్స్, ఇతర సేవలను ఆన్ లైన్ లోనే పొందవచ్చు. ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజర్లు తమ అకౌంట్ ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్, ఇతర సర్వీసులు 24గంటలు చూసుకోవచ్చు. ఏటీఎమ్, డెబిట్ కార్డు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బిఐ వినియోగదారులు పలు రకాల సేవలను పొందుతున్నారు.

Next Story