SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు.. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ప్రయోజనాలు

by S Gopi |   (  Updated:2025-10-10 15:22:46  IST  )

యాపిల్, శాంసంగ్, హెచ్‌పీ లాంటి బడా బ్రాండ్లతో ఎస్‌బీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది

SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై భారీ ఆఫర్లు.. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ప్రయోజనాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొనసాగుతున్న పండుగ సీజన్ కోసం ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ కార్డ్ భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా కస్టమర్ల కోసం 'ఖుషియాన్ అన్‌లిమిటెడ్' పేరుతో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఆభరణాలు, కిరాణా సామగ్రి సహా అనేక రకాల విభాగాల్లో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లతో పాటూ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే యాపిల్, శాంసంగ్, హెచ్‌పీ లాంటి బడా బ్రాండ్లతో ఎస్‌బీఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కస్టమర్లు ఎస్‌బీఐ కార్డును ఉపయోగించి యాపిల్ ఉత్పత్తులపై రూ. 6,000 వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపింది. ఈ ఆఫర్లు ఎస్‌బీఐకి చెందిన వివిధ కారులపై వేర్వేరుగా ఉన్నాయి.

* ఆన్‌లైన్ షాపింగ్ కోసం సింప్లీక్లిక్ కార్డు ద్వారా 10 రివార్డు పాయింట్లు, ఇతర ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5 రివార్డు పాయింట్లు అందిస్తోంది.

* ఫ్లిప్‌కార్ట్, మింత్రా కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డును తీసుకొచ్చింది. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, మింత్రాలో 7.5 శాతం క్యాష్‌బ్యాక్ సహా ఇతర ఆఫర్లు ఇస్తోంది.

* ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ కార్డు ద్వారా లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఏడాదికి 50 వేల వరకు బోనస్ రివార్డ్ పాయింట్లు, అదనంగా కాంపిమెంటరీ డైనింగ్, మూవీ టికెట్లు ఇస్తోంది.

* ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ కార్డు ఉపయోగించడం ద్వారా లాంజ్ యాక్సెస్, ప్రయాణ ఖర్చులపై రివార్డులు ఆఫర్ చేస్తోంది.

* టాటా న్యూ ఇన్ఫినిటీ ఎస్‌బీఐ కార్డు ద్వారా టాటాకు చెందిన క్రోమా, ఎయిర్ఇండియా, ఐహెచ్‌సీఎల్‌లలో 5 శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది.

* ఫోన్‌పె ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్ బాల్ ద్వారా డిజిటల్-ఫస్ట్ కస్టమర్ల కోసం ఫోన్‌పె, ఇతర యాప్ ఆధారిత లావాదేవీలపై రివార్డులు అందిస్తోంది.

Next Story