SBI: మీ అకౌంట్‌లో నుంచి రూ. 236 కట్ అయ్యయా? కారణం ఇదే!

by Vennela |

SBI: కొన్ని రోజులుగా ఎస్బిఐ(SBI) అకౌంట్ నుంచి కొంత మేర డబ్బులు కట్ అవుతున్నాయి.

SBI: మీ అకౌంట్‌లో నుంచి రూ. 236 కట్ అయ్యయా? కారణం ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: SBI: కొన్ని రోజులుగా ఎస్బిఐ(SBI) అకౌంట్ నుంచి కొంత మేర డబ్బులు కట్ అవుతున్నాయి. దీంతో ఖాతాదారులు అసలేం జరిగిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎలాంటి మెసేజ్ రాలేదు..ఎవరీకి డబ్బులు పంపించలేదు. అయినా అకౌంట్ నుంచి 236 రూపాయలు కట్ అయ్యాయి. గత కొన్నిరోజులుగా ఎస్బిఐ (SBI) అకౌంట్స్ ఖాతాదారులు గమనిస్తున్న విషయం ఇదే. అయితే ఎస్బిఐ అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు కట్ అయ్యాయంటే..ఆర్థిక ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఎస్బిఐ ఏటీఎం కార్డులను వసూలు చేస్తోంది. ఎస్బిఐ క్లాసిక్(SBI Classic), సిల్వర్, గ్లోబల్ వంటి కార్డులకు సంబంధించిన వార్షిక రుసుము రూ. 200గా ఉంది.

ఈ మొత్తాన్ని ఎస్బిఐ(SBI) వసూలు చేసింది. అయితే రూ. 236 ఎందుకు కట్ చేశారన్న సందేహం కూడా వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ పై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. దీని ప్రకారం 18శాతం అంటే రూ. 36ట్యాక్స్ ఉంటుంది. ఇలా మొత్తం 236 రూపాయలు అకౌంట్ నుంచి కట్ అవుతాయి. అయితే ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు అనేవి మనం ఉపయోగించే కార్డ్ రకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో సరిపడ డబ్బులు లేనట్లయితే బ్యాలెన్స్ మైనస్ అవుతుంది.

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ కార్డులకు రూ. 236కట్ చేసుకుంటారు. అలాగే యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ కోసం రూ. 250తో పాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. ఇక ప్లాటినం కార్డులకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డులపై మొత్తం రూ. 350తోపాటు జీఎస్టీ వసూలు చేస్తారు. గరిష్టంగా ప్రైడ్, ప్రీమియం కార్డులపై ఏకంగా రూ. 425తో అతనంగా జీఎస్టీని వసూలు చేస్తారు. అయితే కొందరికి ఈ డబ్బు డెబిట్ కు సంబంధించి మెసేజ్ లు కూడా వస్తున్నాయి. అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీ పేరుతో డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయి.

ఇక ఎస్బిఐ యూపీఐ పేమెంట్స్(SBI UPI Payments) విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బిఐ(SBI). రోజువారీ యూపీఐ లావాదేవీ లిమిట్ ను అమలు చేసింది. దీని ప్రకారం యూజర్లు రోజుకు గరిష్టంగా 10ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. లక్ష వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని పెంచుకోవాలంటే ఎస్బిఐకి చెందిన యోనో యాప్(Yono App) ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.


Next Story