SBI: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఆర్థికవ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి

by S Gopi |   (  Updated:2026-05-28 16:38:30  IST  )

దీని ప్రభావంతో రూపాయి విలువ తగ్గడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

SBI: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఆర్థికవ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థికవ్యవస్థకు సవాలుగా మారుతున్నాయని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల మన దేశ దిగుమతి ఖర్చులు భారమై, సామాన్యులపై ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రూపాయి విలువ తగ్గడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా భారత్ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందని శెట్టి వివరించారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, మన ఆర్థిక పునాదులు బలంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో దేశం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటుపై కొంత ప్రభావం ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.

Next Story