Samsung: స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్

by S Gopi |

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్ ద్వారా శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటుందని శాంసంగ్ వివరించింది.

Samsung: స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తన ఎస్25 సిరీస్‌లో సరికొత్త స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. గెలాక్సీ ఎస్24 ఎడ్జ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత సన్నగా ఉండటమే కాకుండా పూర్తిగా కొత్త ఫీచర్లతో లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది 5.8మిల్లీమీటర్లతో ఆల్ట్రా-స్లిమ్‌గా ఉంటూనే తేలికైన డిజైన్ కలిగి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ఎస్25 సిరీస్‌లో ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ చిప్ ద్వారా శక్తివంతమైన పనితీరును కలిగి ఉంటుందని శాంసంగ్ వివరించింది. 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్, ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రాలో ఉండే 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అలాగే, గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కార్నింగ్ గ్లాస్ గొరిల్లా సిరామిక్ 2 ప్రొటెక్షన్‌తో లభ్హించే ఈ స్మార్ట్‌ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, ఐపీ68 రేటింగ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్‌యూఐ 7తో పనిచేస్తుంది. 12ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరాను ఇచ్చారు. 3,900 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 25 వాట్స్ వైర్డ్ చార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. టైటానియం జెట్ బ్లాక్, టైటానియం ఐసీబ్లూ, టైటానియం సిల్వర్ రంగుల్లో లభించే ఎస్24 ఎడ్జ్‌ను కేవలం రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. ధరలకు సంబంధించి.. 12జీబీ, 256జీబీ స్టోరేజీతో కూడా బేస్ వేరియంట్‌ను ధర రూ. 1,09,999 ఉండగా, మరొకటి 12జీబీ, 512జీబీ స్టోరేజ్‌తో వచ్చే వేరియంట్ ధర రూ. 1,21,999గా నిర్ణయించింది.

Next Story