Samsung Galaxy S24 Ultra ; శాంసంగ్ పై భారీ డిస్కౌంట్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే!

by velandi.Saikiran |

శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

Samsung Galaxy S24 Ultra ; శాంసంగ్ పై భారీ డిస్కౌంట్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : శాంసంగ్ మొబైల్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెల్ నేపథ్యంలో గెలాక్సీ s24 అల్ట్రా మొబైల్ పై భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ మొబైల్ ను 71,999 వేలకు అందించనుంది అమెజాన్.

ఇక బ్యాంకు డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డులు , ఎక్స్చేంజ్ లాంటివి కలపకుండానే ఇంత తక్కువ ధరకు అందిస్తున్నారు. ఇతర ఆఫర్లు కలుపుకుంటే మరో 10% మొబైల్ ధర తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ లో బేస్ ధర లక్ష రూపాయల పైన ఉంది. అంటే దాదాపు 30 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే... 6.8 అంగుళాల డిస్ప్లే అందిస్తున్నారు. ఏఐ సామర్ధ్యాలను కూడా కలిగి ఉంటుంది. 5000 mah బ్యాటరీ కూడా అందిస్తున్నారు. ఇది 45W వైర్డ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Next Story