Samsung Galaxy F36: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే

by velandi.Saikiran |

భారత మార్కెట్లోకి అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాంసంగ్ నుంచి మరో 5g మొబైల్

Samsung Galaxy F36: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : భారత మార్కెట్లోకి అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాంసంగ్ నుంచి మరో 5g మొబైల్ వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 36, 5జి పేరుతో ( Samsung Galaxy F36 5G ) కొత్త మొబైల్ లాంచ్ చేశారు. జులై 29వ తేదీ నుంచి... ఆన్లైన్ లో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు కూడా చేసింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఈ కొత్త గెలాక్సీ ఎఫ్ 36 మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది.

సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా అమర్చారు. ఇక ఈ కొత్త మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ 6.7 అంగుళాలు ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యు ఐ 7 సిస్టం తో పని చేస్తుంది ఈ మొబైల్. ఇందులో Exynos 1380 అనే ఓన్ ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ ఫోన్...రెండు మోడల్స్ లో మనకు అందిస్తున్నారు. 6gb + 128 జీబీ మోడల్ మొబైల్ ధర 17,499 ఫిక్స్ చేశారు. అదే సమయంలో 8 జీబీ + 256 జీబీ మోడల్ మొబైల్ ధర 18,999 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ శాంసంగ్ మొబైల్ మూడు కలర్స్ లో మనకు లభిస్తుంది.

Next Story