Samsung: ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ డేస్ సేల్‌ను ప్రకటించిన శాంసంగ్

by S Gopi |

డిసెంబర్ 16-18 మధ్య మూడు రోజులు మాత్రమే ఈ సేల్ ఉంటుందని స్పష్టం చేసింది.

Samsung: ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ డేస్ సేల్‌ను ప్రకటించిన శాంసంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మొదటిసారి గెలాక్సీ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది.ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించిన ఈ సేల్‌లో భాగంగా కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై భారీ రాయితీలు, ప్రయోజనాలు అందిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్ డిసెంబర్ 16-18 మధ్య మూడు రోజులు మాత్రమే ఉంటుందని, ఇది కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ-కామర్స్ యాప్, వెబ్‌సైట్‌లో కస్టమర్లు అధిక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, పెయిర్-అప్ డీల్స్, శాంసంగ్ కేర్ ప్లస్ ప్రయోజనాలు, రివార్డులను కూడా పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. రూ. 12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై అధిక ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అదనంగా, శాంసంగ్ పెయిర్-అప్ డీల్స్ కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కస్టమర్లు అర్హత కలిగిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లతో కొనుగోలు చేసినప్పుడు గెలాక్సీ వేరబుల్స్, యాక్సెసరీలపై రూ. 5000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంపిక చేసిన శాంసంగ్ ఫోన్‌లు, వేరబుల్స్‌తో పాటు టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లపైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. కస్తమర్లు శాంసంగ్ కేర్ ప్లస్ ప్లాన్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అర్హత ఉన్న గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రమాదవశాత్తు, మరో రకంగా నష్టాలకు దీర్ఘకాలిక మద్దతును అందిస్తుంది.

Next Story