- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: ఇతర కరెన్సీల కంటే రూపాయే బెటర్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల కరెన్సీలు అమెరికా డాలర్ ప్రభావం కారణంగా రూపాయి కంటే ఎక్కువ దెబ్బతిన్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని వారాలుగా భారత కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతున్న అంశమపి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. అంతర్జాతీయంగా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయే బెటర్ అని, మన వద్ద అధిక స్థాయిలో విదేశీ కరెన్సీ నిల్వలు ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. గురువారం పారిశ్రామిక జోన్‌లకు సంబంధించిన సమస్యలపై చర్చకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు అంశాలను విలేకరులతో పంచుకున్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల కరెన్సీలు అమెరికా డాలర్ ప్రభావం కారణంగా రూపాయి కంటే ఎక్కువ దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచే ఈ ప్రభావం మరింత పెరిగింది. కానీ, మన వద్ద విదేశీ మారకపు నిల్వలు మెండుగా ఉండటంతో రూపాయి మెరుగ్గా రాణిస్తోందని పీయుష్ గోయల్ వివరించారు. ఈ సందర్భంగా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై పారిశ్రామిక ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరించామని గోయల్ వెల్లడించారు. త్వరలో ఏయూఆర్ఐసీ(షెంద్రా, బిడ్కిన్ పారిశ్రామిక నోడ్) వద్ద స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్టప్ ఇంక్యుబేషన్ హబ్ వస్తుందని, ఉపాధి కల్పించడంతో పాటు పరిశోధనలకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 100కు పైగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పారిశ్రామిక వృద్ధికి హాట్‌స్పాట్ అవుతుందని పేర్కొన్నారు.






