- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్రలోనే అత్యంత కనిష్ఠానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే 95.80 వద్ద ట్రేడ్
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిని తాకింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా ట్రేడింగ్ (Trading) చరిత్రలోనే భారీ పతనాన్ని మూటగట్టుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 95.80 స్థాయికి పడిపోయి సరికొత్త రికార్డు స్థాయి కనిష్ఠాన్ని (Lifetime Low) తాకింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు (Outflows) భారీగా తరలిపోవడమే ఈ పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారంపై దిగుమతి సుంకం పెంచినా ఊరట దక్కలేదు.
దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను నిరంతరంగా వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం రూపాయి విలువను దెబ్బతీసింది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ ఇంతటి కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి. ఈ ప్రభావంతో దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.






