ఆల్‌‌టైమ్ కనిష్టానికి రూపాయి.. RBI సంచలన నిర్ణయం

by Kema Shiva Kumar |

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చారిత్రాత్మకంగా రూ.96.68కి పడిపోవడంతో ఆర్‌బీఐ (RBI) అలర్ట్ అయింది.

ఆల్‌‌టైమ్ కనిష్టానికి రూపాయి.. RBI సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ ఏకంగా రూ.96.68కి క్షీణించడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రూపాయి విలువను కాపాడేందుకు ఈనెల 26న భారీ ఎత్తున ‘డాలర్-రూపీ స్వాప్ ఆక్షన్’ (Dollar-Rupee Swap Auction) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

స్వాప్ వేలంతో జరిగేది ఇదే..

మూడేళ్ల గడువు ప్రాతిపదికన 5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులతో ఆర్‌బీఐ స్వాప్ చేయనుంది. ఈ ప్రత్యేక ఆర్థిక ప్రక్రియలో బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను ఆర్‌బీఐకి విక్రయించి, దానికి సమానమైన భారతీయ రూపాయి కరెన్సీని పొందుతాయి. తిరిగి మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత, ముందే నిర్ణయించుకున్న ధర (Premium రేటు)కు బ్యాంకులు ఆ డాలర్లను ఆర్‌బీఐ నుంచి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఆర్‌బీఐ చేపట్టే ఈ స్వాప్ ఆక్షన్ ద్వారా మార్కెట్లోకి భారీగా డాలర్లు వచ్చి చేరుతాయి. బ్యాంకుల వద్ద రూపాయి లిక్విడిటీ పెరిగి, డాలర్‌పై ఉన్న అదనపు ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కరెన్సీ మార్కెట్లో రూపాయి మరింత క్షీణించకుండా అడ్డుకట్ట పడనుంది.

Next Story