- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ
డాలర్ బలంగా ఉండటం, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల భారత కరెన్సీని దెబ్బతీశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశ కరెన్సీ రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి చేరింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల ధోరణి, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా సోమవారం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 34 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి రూ. 89.79కి చేరుకుంది. డాలర్ బలంగా ఉండటం, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల భారత కరెన్సీని దెబ్బతీశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. మరోవైపు, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ కూడా మన కరెన్సీపై ఒత్తిడి పెంచింది.
ఈ వారం ఇంటర్‌బ్యాంక్ విదేశీ ద్రవ్య మార్కెట్లో రూపాయి రూ. 89.45 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత బలహీనపడి రూ. 89.79కి పడిపోయింది. ఎఫ్‌పీఐలు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం, అధిక వాల్యూయేషన్, చమురు బంగారం కొనుగోళ్ల కారణంగా రూపాయి ఒత్తిడిలోకి చేరిందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్ ఎల్ఎల్‌పీ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలి అన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చల ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, ఏడాది చివరి నాటికి పరిష్కారం లభిస్తుందనే అంచనాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగానే ట్రేడింగ్ మొదలైనప్పటికీ కొద్దిసేపటి తర్వాత నష్టాల్లోకి జారాయి. ఇందుకు ప్రధానంగా ఆర్‌బీఐ రేటు తగ్గింపుపై అంచనాలు తగ్గడం, బలమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య సెంట్రల్ బ్యాంకు రేట్లను స్థిరంగా ఉంచవచ్చనే ఊహాగానాలు పెరిగాయి. దీనికి తోడు రూపాయి జీవితకాల కనిష్టానికి చేరడం, అమెరికాతో వాణిజ్యంపై ఆందోళనలు మార్కెట్ల బలహీనతకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.77 పాయింట్లు పడిపోయి 85,641 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్లు తగ్గి 26,175 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీఎంపీవీ, మారుతీ సుజుకి, బీఈఎల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.






