- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూపాయి ఢమాల్.. ఆల్ టైం కనిష్టానికి డౌన్
by Muthe.Rajitha |
మరోసారి ఇండియన్ రూపాయి విలువ భారీగా పడిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మరోసారి ఇండియన్ రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలర్ తో పోల్చితే సోమవారం మధ్యాహ్నానికి 89.76 ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుత మిడ్-మార్కెట్ రేటు ₹89.66 స్థాయిలో ఉండగా.. గత 30 రోజుల్లోనే ₹88.47 నుండి ఈ స్థాయికి చేరడం గమనార్హం. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2022లోనే ₹83.20 రికార్డును దాటేసింది. అయితే డాలర్ విలువ బలోపేతం కావడం, విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ, అంతర్జాతీయ మార్కెట్ అస్థిరత, ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల దిగుమతులు ఖరీదవడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఎగుమతులకు కొంత ఊతం లభిస్తుందని అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో త్వరలోనే స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Next Story






