ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.12,000 భారీ తగ్గింపు, జీరో డౌన్ పేమెంట్

by Disha Web Desk 17 |
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.12,000 భారీ తగ్గింపు, జీరో డౌన్ పేమెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా వరుసగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్తగా భారీ తగ్గింపుతో ముందుకు వచ్చింది. తన S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పరిమిత-కాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు రూ. 12,000 తగ్గింపుతో S1 ప్రో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఓలా కేర్ ప్లస్‌పై 50 శాతం తగ్గింపు, ఒక సంవత్సరం పాటు ఉచిత హైపర్‌ఛార్జ్ యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.


ఇంకా వినియోగదారులకు జీరో డౌన్ పేమెంట్, తక్కువ వడ్డీ రేటు, అతి తక్కువ EMI, జీరో ప్రాసెసింగ్ ఫీజు మొదలగు సదుపాయాలు ఉన్నాయి. అలాగే కొనుగోలు దారులు తమ పాత వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ. 4,000 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.


Ola S1 ప్రో కేవలం 2.9 సెకన్లలో 0-40kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 116 kmh. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 181 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వినియోగదారులకు ఇది 12 కలర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1,30,999గా ఉంది. దీనిలో LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టవిటీ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.


Next Story

Most Viewed