Infosys Narayanamurthy: అదృష్టం అంటే ఇదే పో.. 17 నెలల బాలుడికి ఇన్ఫోసిస్ లో 3.3 కోట్ల డివిడెండ్

by Prasad Jukanti |

ఇన్ఫోసిస్ తుది డివిడెండ్ ను ప్రకటించింది. ఇందులో నారాయణ మూర్తి 17 నెలల మనువడికి భారీగా డివిడెండ్ దక్కింది.

Infosys Narayanamurthy: అదృష్టం అంటే ఇదే పో..  17 నెలల బాలుడికి ఇన్ఫోసిస్ లో 3.3  కోట్ల డివిడెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రెండో అగ్రగామి ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) 2024-25 జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ ను సంస్థ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.22 చొప్పున తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. అయితే డివిడెండ్‌లో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) 17 నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి (Aakagraha Rohan Murthy) భారీగా డివిడెంట్ అందుకున్నారు. 2023లో ఏకాగ్రహ్ రోహన్ జన్మించినప్పుడు బహుమతిగా రూ.15 లక్షల షేర్లను నారాయణమూర్తి ఆ బాలుడికి ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది. తాజాగా బోర్డు తుది డివిడెండ్ (Dividend Announcement) ప్రకటించిది. దీంతో కంపెనీలో ఏకాగ్రహ్ రూ.15 లక్షల షేర్లు కలిగి ఉండటంతో డివిడెంట్ రూపంలో రూ.3.3 కోట్లు అదుకోనున్నాడు. కాగా చిన్న వయసులోనే ఏకాగ్రహ్ రూ. కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Next Story