- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OMCs: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఓఎంసీలకు ఊరట
ఈ పెంపుతో రోజుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు చేరిన నష్టాలు ఇప్పుడు రూ.750 కోట్లకు తగ్గాయని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచిన తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) తమ రోజువారీ నష్టాలను దాదాపు పావు వంతు తగ్గించుకోగలిగాయని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పెంపుతో రోజుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు చేరిన నష్టాలు ఇప్పుడు రూ.750 కోట్లకు తగ్గాయని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇంకా అధికంగానే ఉండటం, రూపాయి బలహీనపడటం వల్ల దేశీయ ఇంధన ధరలు ఖర్చుల రికవరీ స్థాయికి ఇంకా చేరలేదన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక సబ్సిడీ లేదా బెయిలౌట్ ప్యాకేజీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం తగ్గింపు, తాజా ధరల పెంపు కారణంగా పెట్రోల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.10కి, డీజిల్‌పై రూ.13కి తగ్గిందని క్రిసిల్ అంచనా వేస్తోంది. అయినప్పటికీ, ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి మే నెలాఖరు నాటికి ప్రభుత్వ రంగ ఓఎంసీల మొత్తం నష్టాలు రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన ధరల పెంపు చమురు కంపెనీలకు తాత్కాలిక ఊరటనిచ్చినా, దీని ప్రభావం ద్రవ్యోల్బణంపై కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.






