- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇప్పటికీ రాలేదు: ఆర్‌బీఐ
2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న వాటిలో 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నప్పటికీ, పూర్తి స్థాయిలో తిరిగి చేరలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెలిపింది. శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఇప్పటికీ రూ. 5,817 కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణిలోనే ఉన్నాయి. జారీ చేసిన రూ.2,000 నోట్లలో 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న వాటిలో 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 2,000 విలువైన కరెన్సీ నోట్ల ఉపసంహరణ ప్రకటించిన మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి రూ.3.56 లక్షల కోట్లుగా వ్యవస్థలో ఉన్నాయి. ఇవి ఈ ఏడాది అక్టోబర్ 31 సమయానికి రూ.5,817 కోట్లకు తగ్గిందని సెంట్రల్ బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ నోట్లను దేశంలోని 19 ఆర్‌బీఐ ఆఫీసుల్లో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఆర్‌బీఐ కార్యాలయాలకు వెళ్లలేని వారు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచి అయినా, వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్‌బీఐ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పెద్ద నోట్లను పంపవచ్చు.






