- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitaraman: పారదర్శకతను పెంచి, సంక్లిష్టతలను తగ్గించడానికే జీఎస్టీ సంస్కరణలు
జీఎస్టీ సంస్కరణలు ఆర్థికవ్యవస్థలో మరింత పారదర్శకత ఉంటుందని, ఈ పన్ను చట్టంలోని సంక్లిష్టతల భారాన్ని తగ్గిస్తాయని అన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలకు సంబంధించి కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలు ఆర్థికవ్యవస్థలో మరింత పారదర్శకత ఉంటుందని, ఈ పన్ను చట్టంలోని సంక్లిష్టతల భారాన్ని తగ్గిస్తాయని, చిన్న వ్యాపారాలు సులభంగా వృద్ధిని సాధించే వీలుంటుందని అన్నారు. మంగళవారం తమిళనాడులోని చెన్నైలో జరిగిన సిటీ యూనియన్ బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. బ్యాంకులు క్రెడిట్‌ను విస్తరించడమే కాకుండా, నమ్మకం, సాంకేతికత, పారదర్శకత ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని బ్యాంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) సకాలంలో, అవసరాలకు అనుగుణంగా నిధులను అందించాలని, బ్యాంకింగ్ సేవలు లేని వారిని దాని పరిధిలోకి తీసుకురావాలని ఆమె కోరారు. దేశ నిర్మాణంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల కీలక పాత్రను ప్రస్తావిస్తూ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఆస్తి నాణ్యతలో గణనీయంగా మెరుగుపడ్డాయని, స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) దశాబ్ద కనిష్ట స్థాయి 2.3 శాతం వద్ద ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న సవాళ్ల మధ్య మన బ్యాంకులు దీన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ క్రమంలో నిబంధనలను సరళీకృతం చేయడం, సంక్లిష్ట ఖర్చులను తగ్గించడం, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు మరింత అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించే లక్ష్యాలతో తదుపరి తరం సంస్కరణలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.






