RBI: ఆర్‌బీఐ డిప్యూరిటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియామకం

by S Gopi |

ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న టి రబీ శంకర్ స్థానాన్ని రోహిత్ జైన్ భర్తీ చేసే అవకాశం ఉంది.

RBI: ఆర్‌బీఐ డిప్యూరిటీ గవర్నర్‌గా రోహిత్ జైన్ నియామకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న టి రబీ శంకర్ స్థానాన్ని రోహిత్ జైన్ భర్తీ చేసే అవకాశం ఉంది. రోహిత్ జైన్‌కు ఆర్‌బీఐలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 2020, డిసెంబర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన ఆయన, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ, బ్యాంకింగ్ రంగాల్లో పని చేశారు. ముఖ్యంగా రిస్క్, అనలిటిక్స్, వల్నరబిలిటీ అసెస్‌మెంట్ వంటి ముఖ్యమైన విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు పూర్తి చేశారు. ఆర్‌బీఐలోని నలుగురు డిప్యూటీ గవర్నర్లలో ఇద్దరు అంతర్గతంగా పదోన్నతి పొందినవారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆర్‌బీఐలో మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎస్.సి. ముర్ము, పూనమ్ గుప్తా, స్వామినాథన్ జె ఉన్నారు.

Next Story