- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RIL: ఏఐ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10 లక్షల కోట్లు పెట్టుబడి
రిలయన్స్, జియో కలిసి వచ్చే ఏడేళ్ల కాలంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నాయని అంబానీ తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడుల ప్రకటన చేసింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో ఏకంగా రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడిగా పెడతామని సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. రిలయన్స్, జియో కలిసి వచ్చే ఏడేళ్ల కాలంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నాయని అంబానీ తెలిపారు. ఏఐలో తాము కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలకు ఏఐని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు ముఖేశ్ అంబానీ చెప్పారు. మనదేశం కొత్త ఏఐ యుగంలోకి ప్రవేశించడానికి అవసరమైన సహాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. జియో మొబైల్ డేటా, ఇంటర్నెట్‌ను చాలా చౌకగా ఇచ్చినట్లుగానే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచాలని ఆశిస్తోంది. జియో ఇంటెలిజెన్స్ దేశీయ స్వంత శక్తివంతమైన కంప్యూటర్ వ్యవస్థలను నిర్మిస్తుందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. దీనిద్వారా భారత్ ఏఐ టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై పూర్తిగా ఆధారపడవలసిన అవసరం ఉండదన్నారు. జియో అత్యుత్తమ ప్రపంచ టెక్ కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. కానీ వారి నుంచి ఏఐ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి బదులుగా, జియో వారితో కలిసి ఏఐ భవిష్యత్తును నిర్మించి, రూపొందించాలనుకుంటోందని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.






