- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: సైబర్ రిస్కులను సమీక్షించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు
బ్యాంకింగ్ వ్యవస్థల్లో చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) దేశంలోని బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. తమ సైబర్ సెక్యూరిటీ సిద్ధతపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించి, రెండు నెలల్లోగా దాని పూర్తి నివేదికను బోర్డుల ముందుంచాలని ఆదేశించింది. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, అలాగే ఏఐ ఆధారిత ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అధునాతన ఏఐ టెక్నాలజీలు సాఫ్ట్‌వేర్ వ్యవస్థలలోని లోపాలను వేగంగా గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థల్లో చిన్న లోపాలు కూడా పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 27న సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన అడ్వైజరీలో భాగంగా ఈ ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బ్యాంకుల అధిపతులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశం తర్వాతే ఆర్‌బీఐ ఈ అడ్వైజరీని జారీ చేసింది. టెక్నాలజీలో ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంపై పెద్ద ప్రభావం చూపే అవకాశముందని పరిశ్రమ నిపుణుల పేర్కొంటున్నారు.






