Retail Inflation: అక్టోబర్‌లో దశాబ్ద కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

అక్టోబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం దశాబ్దం కనిష్టం 0.25 శాతానికి చేరుకుందని బుధవారం గణాంకాలు వెల్లడించాయి

Retail Inflation: అక్టోబర్‌లో దశాబ్ద కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా దిగివచ్చింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో పాటు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా రోజువారీ వస్తువులు మొదలు కార్ల వరకు అనేక రకాల ధరలు తగ్గాయి. దీంతో అక్టోబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం దశాబ్దం కనిష్టం 0.25 శాతానికి చేరుకుందని బుధవారం ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధానంగా జీఎస్టీ రేట్లు తగ్గడం దోహదపడింది. అలాగే, వంటనూనె, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గుడ్ల ధరలు దిగిరావడం కూడా కారణమని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన నెలలో కూరగాయల ధరలు 27.57 శాతం తగ్గాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో వీటి ధరలు 21.38 శాతం క్షీణించాయి. మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బాగా తగ్గింది. సెప్టెంబర్‌లో -2.28 శాతం నుంచి గత నెలలో -5.02 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది -4.85 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో -5.18 శాతంగా ఉంది.

Next Story