Retail Inflation: 3 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

గతంతో పోలిస్తే డిసెంబర్‌లో ఆహార పదార్థాల ధరల తగ్గుదల నెమ్మదించడమే ఇందుకు కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Retail Inflation: 3 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. అంతకుముందు నవంబర్‌లో 0.71 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం గత నెలలో 1.33 శాతానికి పెరిగింది. ఇది మూడు నెలల గరిష్టమని కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటనలో తెలిపింది. గతంతో పోలిస్తే డిసెంబర్‌లో ఆహార పదార్థాల ధరల తగ్గుదల నెమ్మదించడమే ఇందుకు కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ధరలు 2.71 శాతం తగ్గాయి. ఇది నవంబర్‌లో నమోదైన 3.91 శాతం కంటే తక్కువ. కూరగాయల ధరలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి, కానీ ఈ తగ్గుదల రేటు కొంత నెమ్మదించింది. నవంబర్‌లో 22.20 శాతం క్షీణిస్తే, డిసెంబర్‌లో వీటి ధరలు 18.47 శాతం తగ్గాయి. ద్రవ్యోల్బణ ధోరణి అత్యంత సానుకూలంగా ఉంది, ఇది రాబోయే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల్లో చివరి రేట్ల కోతకు అవకాశం కల్పిస్తోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసన భరద్వాజ్ అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినప్పటికీ, తక్షణం ప్రజల ఖర్చులపై ప్రభావం ఉండదు. ధరలు ఇప్పటికీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు ఏడాది క్రితం కంటే చౌకంగానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Next Story