Retail Inflation: నవంబర్‌లో 0.71 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

కూరగాయలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణమని శుక్రవారం కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటాను విడుదల చేసింది.

Retail Inflation: నవంబర్‌లో 0.71 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం గత నెల స్వల్పంగా పెరిగింది. అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 0.25 శాతం కనిష్టానికి చేరిన వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్‌(సీపీఐ) ద్రవ్యోల్బణం నవంబర్‌లో 0.71 శాతానికి చేరింది. కూరగాయలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణమని శుక్రవారం కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటాను విడుదల చేసింది. కూరగాయలతో పాటు ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాల ధరలు కూడా ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఅ) లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా 10వ నెల. మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణంలో అధిక భాగం కలిగిన ఆహార పదార్థాల ధరలు -3.91 శాతంగా, కూరగాయల ధరలు -22.20 శాతంగా నమోదయ్యాయని గణాంకాలు తెలిపాయి. పప్పుధాన్యాలు, రవాణా, కూరగాయలు, ధాన్యాల ధరలు తగ్గడం వల్ల మొత్తంగా ఆహార, రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదయ్యేందుకు ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది.

Next Story