- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Retail Inflation: ఆరేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా నమోదవడం ఇది వరుసగా నాలుగో నెల.

దిశ, బిజినెస్ బ్యూరో: రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా దిగి వచ్చింది. ఈ ఏడాది మే నెలకు సంబంధించి వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా 2.82 శాతానికి తగ్గింది. ఇది గడిచిన ఆరేళ్లలోనే కనిష్టం కావడం విశేషం. 2019, ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతేకాకుండా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా నమోదవడం ఇది వరుసగా నాలుగో నెల. 2025, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలో 4.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉండటం, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు చౌకగా మారడంతో ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం కనిపించింది. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 1.78 శాతం నుంచి 0.99 శాతానికి క్షీణించింది. ఇది 2021, అక్టోబర్ తర్వాత అత్యల్పమని ప్రభుత్వం పేర్కొంది. దీనర్థం ప్రజలు ఏడాది క్రితం చెల్లించిన మొత్తం కంటే తక్కువకు ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నట్టు భావించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.92 శాతం నుంచి 2.59 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 1.85 శాతం నుంచి 0.95 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాలోనూ ఇదే ధోరణి కనిపించింది. ఇక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం 3.36 శాతం నుంచి 3.07 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 1.64 శాతం నుంచి 0.96 శాతానికి దిగొచ్చింది.






