- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Retail Inflation: 8 ఎళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
వరుసగా 9వ నెల కూడా ద్రవ్యోల్బణం తగ్గటంతో ప్రజలకు ఉపశమనం లభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో దిగివచ్చింది. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 1.55 శాతానికి పడిపోయింది. ఇది 2017 తర్వాత అత్యంత కనిష్టం. దీంతో వరుసగా 9వ నెల కూడా ద్రవ్యోల్బణం తగ్గటంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహార ధరల ద్రవ్యోల్బణం -1.76 శాతానికి పడిపోయింది. ఇది 2019, జనవరి తర్వాత అత్యల్పం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆహార పదార్థాల ధరలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం తగ్గటానికి ప్రధానంగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గుడ్లు, రవాణా, కమ్యూనికేషన్ వంటి వాటి రేట్లు తగ్గటమేనని గణాంకాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతానికి తగ్గింది/ పట్టణ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి దిగొచ్చింది. రుతుపవనాలు అసమానంగా ఉన్నప్పటికీ, పంటల దిగుబడి ఆహార ధరలు పెరగకుండా ఉండేందుకు కారణమయ్యాయి. సమీక్షించిన నెలలో ఇంధనం, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం 2.67 శాతానికి పెరిగాయి. జూలైలో కూరగాయల ధరలు -20.69 శాతంగా నమోదయ్యాయి.






