రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. మ్యూచువల్ ఫండ్స్‌ విదేశీ ఆస్తులు, అప్పులపై సర్వే షురూ

by Kema Shiva Kumar |

భారతదేశ విదేశీ పెట్టుబడుల స్థితిగతులను అంచనా వేసేందుకు ఆర్‌బీఐ కీలక సర్వే ప్రారంభించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. మ్యూచువల్ ఫండ్స్‌ విదేశీ ఆస్తులు, అప్పులపై సర్వే షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల స్థితిగతులను పర్‌ఫెక్ట్‌గా అంచనా వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. మ్యూచువల్ ఫండ్ కంపెనీల విదేశీ ఆస్తులు, అప్పుల సమాచారాన్ని సేకరించేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక సర్వేను అధికారికంగా ప్రారంభించింది. అయితే, దేశంలో పనిచేస్తున్న మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCs) విదేశాల నుంచి సేకరించిన పెట్టుబడులు, అలాగే అవి విదేశీ మార్కెట్లలో చేసిన పెట్టుబడుల సమగ్ర వివరాలను సేకరించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ఈ డేటాతో భారతదేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (BoP), ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పొజిషన్ (IIP) గణాంకాలను ఆర్‌బీఐ అంతర్జాతీయ ప్రమాణాలను బేస్ చేసుకుని లెక్కలను సరిచేయనుంది.

కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘CIMS’‌తో సర్వే..

అయితే, ఈసారి సర్వేను మరింత సులభతరం చేసేందుకు ఆర్‌బీఐ సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ఇప్పటివరకు ఎక్సెల్ షీట్ల ద్వారా పంపే పాత పద్ధతికి స్వస్తి పలికి, ఈ ఏడాది నుంచి సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ CIMS) అనే కొత్త వెబ్ ఆధారిత పోర్టల్ ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ డేటాను జూలై 7 లోపు సమర్పించాలని ఆర్బీఐ గడువు విధించింది. దేశంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న తరుణంలో దేశ ఆర్థిక భద్రతను పర్యవేక్షించేందుకు ఈ డేటా మరిం కీలకం కానుంది.

Next Story