- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ లోన్స్ పై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
బ్యాంకుల్లో గోల్డ్ ను తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల్లో గోల్డ్ ను తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. రుణదాతలు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయకూడదు. బంగారం నాణ్యతతో పాటు, తాకట్టు తేదీ నుంచి మొదటి 30 రోజుల సగటు ముగింపు ధరను లేదా ముందురోజు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకొని రుణ మొత్తాన్ని నిర్ణయించవచ్చు.
రుణాలకు లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ఆర్‌బీఐ నిర్దేశించింది
రూ.2.5 లక్షల కంటే తక్కువ రుణాలకు 85%.
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలకు 80%.
రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75%.
తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే గరిష్ఠంగా 1 కేజీ, వెండి అయితే 10 కేజీలకు మించకూడదు. బంగారం నాణేల రూపంలో ఉంటే ఒక్కో నాణెం 50 గ్రాములు, వెండి నాణేలు అయితే 500 గ్రాములకు మించకూడదు. రుణం తిరిగి చెల్లించినట్లయితే.. అదే రోజు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో.. గరిష్ఠంగా ఏడు పని దినాలలోపు బంగారాన్ని తిరిగి అందజేయాలి. రుణదాత, రుణ గ్రహీత మధ్య ఒప్పందంలో తాకట్టు పెట్టిన వస్తువుల వివరాలు, వాటి విలువ, రుణం చెల్లించకపోతే వేలం ప్రక్రియ, వేలానికి ముందు నోటీసు వ్యవధి, వేలం తర్వాత మిగిలిన మొత్తం చెల్లింపు వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఆర్‌బీఐ ఈ మార్గదర్శకాలను సవరించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఏకరూప నిబంధనలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.






