- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. లోన్లు కట్టే వారికి నో రిలీఫ్
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల మేరకు ఈసారి రెపోరేటును స్థిరంగా ఉంచింది.

దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల మేరకు ఈసారి రెపోరేటును స్థిరంగా ఉంచింది. సెప్టెంబర్ 29న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం.. అక్టోబర్ 1న ముగియగా.. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. వడ్డీరేట్లను వరుసగా రెండోసారి 5.5 వద్దే ఉంచుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆగస్టులో వడ్డీరేట్లను స్థిరంగా ఉంచింది. ఆగస్టు నెలలో దేశ వార్షిక ద్రవ్యోల్బణం 2.07 శాతానికి పెరిగిందని, ఆహారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఆహార ధరలు తగ్గడం, పన్ను రేటు కోతలు కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలు మరింత సానుకూలంగా మారాయని MPC గమనించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉండగా.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సీపీఐ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారిత ద్రవ్యోల్బణం 4 లేదా అంతకంటే తక్కువ శాతంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు SBI అంచనా వేసింది. జీఎస్టీ తగ్గించడంతో అక్టోబర్ లో మరింత తగ్గే అవకాశాలున్నట్లు భావించింది. దీనివల్ల ఆర్బీఐ వడ్డీరేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే ఆస్కారం ఉందని అంచనా వేయగా.. SBI అంచనాలకు భిన్నంగా RBI రెపోరేటును యథాతథంగా ఉంచింది. రెపోరేటు తగ్గితే లోన్ ఈఎంఐ తగ్గుతుందని ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది.






