- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rentals: దేశంలో సగటున 30 శాతం పెరిగిన అద్దెలు
త్రైమాసిక పరంగా దేశంలో అద్దెలు 4.8 శాతం, గతేడాదితో పోలిస్తే 29.6 శాతం పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఇంటి అద్దెలు భారీగా పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లు అందుబాటులో రావడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం, యువతలో నిరుద్యోగం తగ్గడంతో అద్దె ధరల పెరుగుదలకు కారణమయ్యాయని ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ వెల్లడించింది. నివేదిక ప్రకారం, త్రైమాసిక పరంగా దేశంలో అద్దెలు 4.8 శాతం, గతేడాదితో పోలిస్తే 29.6 శాతం పెరిగాయి. స్థిరాస్తి రంగంలో డిమాండ్, సరఫరా కూడా 3 శాతం మేర పెరిగింది. అధికంగా గ్రేటర్ నోయిడాలో 20.7 శాతం మేర అద్దెలు పెరిగాయి. ఆ తర్వాత నవీ ముంబైలో 19.4 శాతం, ఢిల్లీలో 17.2 శాతం, కోల్‌కతాలో 13.7 శాతం, అహ్మదాబాద్‌లో 12.2 శాతం హైదరాబాద్‌లో 11.5 శాతం, చెన్నైలో 11.2 శాతం మేర పుంజుకున్నాయి. ఈ నగరాల్లో ప్రధానంగా సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఎక్కువ గిరాకీ ఉందని, సగటున 22 శాతం పెరిగింది. ఇదే సమయంలో 3 బెడ్‌రూమ్ ఇళ్లకు 25 శాతం మేర డిమాండ్ క్షీణించింది. దేశవ్యాప్తంగా 2 బెడ్‌రూమ్ ఇళ్లకు ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదిక తెలిపింది. మొత్తం ఇళ్ల డిమాండ్‌లో 46 శాతం వాటా 2 బెడ్‌రూమ్‌లదే. అదేవిధంగా సెమీ-ఫర్నిష్‌డ్ ఇళ్లకు సగం కంటే ఎక్కువ గిరాకీ కొనసాగుతోంది. ఎక్కువమంది రూ. 10,000-20,000 మధ్య ఉండే ఇళ్ల కోసమే చూస్తున్నారు.






