- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renault: రూ.10 లక్షల లోపు కార్లపై రెనాల్ట్ ఫోకస్
ముఖ్యంగా రూ.10 లక్షల సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నామని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ భారత మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టింది. 2030 నాటికి తన పోర్ట్‌ఫోలియోలో 7 కొత్త మోడళ్లకు తీసుకురావాలని భావిస్తున్నట్టు కమెప్నీ తెలిపింది. ముఖ్యంగా రూ.10 లక్షల సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నామని పేర్కొంది. రెనాల్ట్ గ్రూప్ ఎంట్రీ ప్లాట్‌ఫామ్(ఆర్‌జీఈపీ) ద్వారా కస్టమర్లకు తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు అందించాలనుకుంటున్నాం. ఈ ప్లాట్‌ఫామ్‌పై రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ కైగర్, రెనాల్ట్ ట్రైబర్ వంటి మోడళ్లను కూడా అప్‌గ్రేడ్ చేస్తాం. కొత్త పవర్‌ట్రెయిన్‌లు, ఫ్యాక్టరీ-ఫిట్ సీఎన్‌జీ, డిజిటల్ టెక్నాలజీలు అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, పెద్ద వాహనాలు (4–4.7 మీటర్లు), ఎలక్ట్రిక్ వాహనాల కోసం రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్(ఆర్‌జీఎంపీ)పై కొత్త రెనాల్ట్ డస్టర్‌తో పాటు మరో 4 మోడళ్లు రూపొందిస్తాం. ఈ ప్లాట్‌ఫామ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్, మల్టీ-ఎనర్జీ టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.






