- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Edible Oil: దిగిరానున్న వంటనూనె ధరలు
గత కొన్ని నెలల కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనెల ధరలు చివరకు తగ్గనున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, సామాన్యులకు ఊరట కలిగించే విధంగా రాబోయే రెండు వారాల్లో రిటైల్ ధరలు 5–6 శాతం తగ్గుతాయని అధికారులు సోమవారం వెల్లడించారు. గత కొన్ని నెలల కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనెల ధరలు చివరకు తగ్గనున్నాయి. త్వరలో సింగిల్ డిజిట్‌కు తగ్గుతాయని భావిస్తున్నామని ఎమామి ఆగ్రోటెక్ డైరెక్టర్, సీఈఓ సుధాకర్ రావు దేశాయ్ జాతీయ మీడియాతో చెప్పారు. కిరాణా స్టోర్లు, సూపర్ మార్కెట్లలో తగ్గిన వంట నూనె ధరలు అందుబాటులోకి వస్తాయి. రిటైల్ మార్కెట్లో తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చేందుకు 15 రోజుల సమయం ఉన్నప్పటికీ, హోల్‌సేల్ మార్కెట్లు ఇప్పటికే ధరలను తగ్గించే ప్రక్రియను ప్రారంభించాయని ప్రముఖ బ్రాండెడ్ వంటనూనె తయారీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ధరల సవరణ దిగుమతి చేసుకున్న వంటనూనెలకే కాకుండా, దిగుమతులపై ఆధారపడని ఆవ నూనె కూడా మార్కెట్‌లో 3–4 శాతం తగ్గవచ్చని సుధాకర్ దేశాయ్ అన్నారు. ముడి, శుద్ధి చేసిన నూనెల మధ్య అంతరం బాగా పెరిగింది. కంపెనీలు ముడి చమురును దిగుమతి చేసుకుని శుద్ధి చేయడం ఖర్చుతో కూడుకున్న విషయం. తాజా 10 శాతం సుంకం తగ్గింపు మార్కెట్‌కు గేమ్ ఛేంజర్ కానుందని హాల్దర్ వెంచర్ ఎండీ కేశబ్ కుమార్ హాల్దర్ అన్నారు. ధరల తగ్గుదల ప్రభావం దేశీయంగా బియ్యం ఊక, ఆవ నూనె వంటి వాటిపై కూడా ఉంటుందని, అన్ని విభాగాల్లో ధరలు దిగొస్తాయని అగ్రి కంపెనీ చీఫ్ ఒకరు పేర్కొన్నారు.






