Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్ ' ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్న రిలయన్స్

by S Gopi |

జియో స్టూడియోస్ కంపెనీలోని జూనియర్ ఉద్యోగి పొరపాటున, సరైన ఆమోదం లేకుండానే దరఖాస్తు చేసినట్టు కంపెనీ వివరణ ఇచ్చింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్  ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకున్న రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా పలు కంపెనీలు, వ్యక్తులు ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం గురువారం దరఖాస్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించి రిలయన్స్ సంస్థ ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్టు సాయంత్రం ప్రకటించింది. సంస్థ అనుబంధ జియో స్టూడియోస్ కంపెనీలోని జూనియర్ ఉద్యోగి పొరపాటున, సరైన ఆమోదం లేకుండానే దరఖాస్తు చేసినట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. భారతీయ ధైర్యసాహసాలకు చిహ్నంగా జాతీయ చైతన్యంలో భాగమైన ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్‌ను వాడుకోవాలనే ఉద్దేశం కంపెనీకి లేదని స్పష్టం చేసింది. పెగల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనంగా ప్రభుత్వం ఆపర్షన్ సిందూర్ నిర్వహించడం రిలయన్స్‌తో పాటు సంస్థ వాటాదారులందరూ గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న రాజీలేని పోరాటంలో సాయుధ దళాల ధైర్యానికి గర్వించే స్థాయిలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి రిలయన్స్ సంస్థ ప్రభుత్వానికి, సాయుధ దళాలకు పూర్తిగా మద్దతిస్తుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆపరేషన్ సిందూర్ అనే పదం కోసం బుధవారమే గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాస్ 41 కింద ట్రేడ్‌మార్క్ కోసం నాలుగు వేర్వేరు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో చైత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్, అలోక్ కొఠారి అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Next Story