- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump-Relaince: అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి
కొత్త శుద్ధి కర్మాగారం ద్వారా అమెరికాలో ఇంధన ఉత్పత్తి పెరగడంతో పాటు జాతీయ భద్రతను పటిష్టం చేస్తుందని ట్రంప్ చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్ట్‌లో 50 ఏళ్లలోనే మొట్టమొదటి కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించడంలో భాగస్వామిగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 300 బిలియన్ డాలర్ల ఒప్పందం ఖరారైనట్టు ఆయన స్పష్టం చేశారు. కొత్త శుద్ధి కర్మాగారం ద్వారా అమెరికాలో ఇంధన ఉత్పత్తి పెరగడంతో పాటు జాతీయ భద్రతను పటిష్టం చేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇందులో భారత్‌కు చెందిన రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టు వెల్లడించారు. కొత్త రిఫైనరీ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఆర్థికవ్యవస్థకు భారీ లాభాలు వస్తాయి. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తక్కువ పన్నులు ఆఫర్ లాంటి అమెరికా ఫస్ట్ విధానాలతోనే సాధ్యమైందని ట్రంప్ వివరించారు. అంతేకాకుండా ఈ చమురు శుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా ఉంటుందని, ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు కూడా ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.






