Reliance Industries: రష్యా చమురు కొనుగోళ్లు నిలిపేసిన రిలయన్స్

by S Gopi |

రష్యా ముడిచమురుపై బ్యారెల్‌కు దాదాపు 7 డాలర్ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 2025 ద్వితీయార్థంలో ఉన్న స్థాయి కంటే ఈ రాయితీ దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.

Reliance Industries: రష్యా చమురు కొనుగోళ్లు నిలిపేసిన రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ముడిచమురు కొనుగోలు సంస్థ నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు రష్యా నుంచి ఒక్క బ్యారెల్ కూడా కొనుగోలు చేయలేదని గణాంకాలు వెల్లడించాయి. కానీ, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి సంస్థలు మాత్రం దిగుమతులను పెంచాయి. రష్యా ముడిచమురుపై బ్యారెల్‌కు దాదాపు 7 డాలర్ల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 2025 ద్వితీయార్థంలో ఉన్న స్థాయి కంటే ఈ రాయితీ దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. 2025లో రిలయన్స్ సంస్థ రోజుకు దాదాపు 6,00,000 బ్యారెళ్ల సముద్రమార్గంలో రష్యా చమురును కొనుగోలు చేసినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనల ప్రభావం కారణంగా ఈ నెలలో మొదటి మూడు వారాల్లో రిలయన్స్ రష్యా ముడిచమురును కొనుగోలు చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, రిలయన్స్‌తో పాటు హెచ్‌పీసీఎల్-మిట్టల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు కూడా ఈ నెలలో రష్యా చమురును కొనుగోలు చేయలేదు. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సగటున రోజుకు 4,70,000 బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసింది, ఇది ఇప్పటివరకు అత్యధికమని కెప్లర్ డేటా తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో ఐఓసీ రోజుకు 4,27,000 బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంది. మరో ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థ బీపీసీఎల్ ఈ నెలలో రోజుకు 1,64,000 బ్యారెళ్లను, గత నెలలో రోజుకు 1,43,000 చమురు కొనుగోలు చేసింది.

Next Story