Reliance Spinner Drink: థాంక్యూ అంబానీ మావ..10 రూపాయలకే కొత్త డ్రింక్ తెస్తున్న రిలయన్స్

by Vennela |

Reliance Spinner Drink: రిలయన్స్ సంస్థ మరో కొత్త డ్రింక్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

Reliance Spinner Drink: థాంక్యూ అంబానీ మావ..10 రూపాయలకే కొత్త డ్రింక్ తెస్తున్న రిలయన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: Reliance Spinner Drink: రిలయన్స్ సంస్థ మరో కొత్త డ్రింక్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది కేవలం రూ. 10లకే త్వరలోనే అందుబాటులోకి రానుంది. రిలయన్స్ కన్య్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ క్రీడా పరిశ్రమను మార్చివేసే స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్ ను విడుదల చేసింది. లెజెండరీ క్రికెట్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ సహకారంతో రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రింక్, వినియోగదారులకు తక్కువ ధరలోనే లభించనుంది. కేవలం రూ. 10కే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. స్పిన్నర్ రాబోయే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల విలువైన స్పోర్ట్స్ బెవరేజ్ విభాగాన్ని రూపొందించేందుకు ముందడుగు వేస్తోంది.

మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే, స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్ ఇండియన్ క్రికెట్ లీగ్ అంటే IPL లోని అనేక జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటిలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఈ భాగస్వామ్యం క్రికెట్ అభిమానులలో 'స్పిన్నర్' పట్ల క్రేజ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. స్పిన్నర్ గేమ్-ఛేంజర్ మురళీధరన్ స్పిన్నర్ సహ-సృష్టికర్త, క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ, “రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో ఈ ఉత్తేజకరమైన వెంచర్‌లో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక అథ్లెట్‌గా, హైడ్రేషన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు, ముఖ్యంగా మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా క్రీడలు ఆడుతున్నప్పుడు. స్పిన్నర్ అనేది గేమ్-ఛేంజర్, ఇది ప్రతి భారతీయుడు హైడ్రేటెడ్ గా, చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

ప్రతి భారతీయుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండాలని మేము విశ్వసిస్తున్నామని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ COO కేతన్ మోడీ అన్నారు. స్పిన్నర్ తో, మీరు ప్రొఫెషనల్ అథ్లెట్ అయినా లేదా హైడ్రేటెడ్ గా ఉండాలనుకునే వ్యక్తి అయినా, ప్రతి ఒక్కరూ ఆస్వాదించగల సరసమైన, ప్రభావవంతమైన హైడ్రేషన్ డ్రింక్ ను మేము సృష్టించాము. క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్, ఐపీఎల్ జట్ల భాగస్వామ్యంతో ఈ వినూత్న ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. కేవలం రూ. 10 ధరకే లభించే ఈ 'స్పిన్నర్' స్పోర్ట్స్ డ్రింక్ నిమ్మకాయ, ఆరెంజ్, నైట్రో బ్లూ వంటి మూడు ఫ్లేవర్లలో దొరుకుతుంది. ఎలక్ట్రోలైట్స్ తో శరీరాన్ని సమతుల్య హైడ్రేషన్ చేస్తుంది. ప్రతి భారతీయుడికి దీన్ని తాగేలా తయారు చేశారు.

Next Story