- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance Retail: జర్మన్ కాస్మొటిక్ బ్రాండ్ 'ఎసెన్స్'ను భారత్‌కు తీసుకొస్తున్న రిలయన్స్
గ్లోబల్ కాస్మెటిక్స్ కంపెనీ కాస్నోవా బ్యూటీతో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని రిలయన్స్ రిటైల్ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం దేశంలో వేగంగా పెరుగుతున్న బ్యూటీ వ్యాపారంపై దృష్టి సారించింది. అందులో భాగంగా యూరప్‌లోని ప్రముఖ కాస్మొటిక్స్ బ్రాండ్ 'ఎసెన్స్'ను భారత మార్కెట్‌కు తీసుకువస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇది దేశంలో పెరుగుతున్న బ్యూటీ వ్యాపారంలో రాణించేందుకు సహాయపడుతుంది. ఈ మేరకు జర్మనీకి చెందిన గ్లోబల్ కాస్మొటిక్స్ కంపెనీ కాస్నోవా బ్యూటీతో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని రిలయన్స్ రిటైల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సహకారం రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తుంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు అధిక నాణ్యత, సరసమైన, హానికరంకాని ఎసెన్స్ బ్యూటీ ఉత్పత్తులను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. ఎసెన్స్ ఉత్పత్తులు రిలయన్స్ రిటైల్ ఇంటిగ్రేటెడ్ ఓమ్నిఛానల్ ఎకోసిస్టమ్ ద్వారా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యూటీ స్టోర్‌లు, భాగస్వామ్య రిటైల్ ఫార్మాట్‌లలో లభిస్తాయి. అధికారిక పంపిణీదారుగా రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులో ఉంచుతుందని పేర్కొంది.






