- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో రిలయన్స్ రిటైల్!

ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే జాబితాలో చేరనుంది. ఇప్పటికే సంస్థ యాజమాన్యంలోని జియో మార్ట్ 1,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో 9,000 మందిని ఇంటికి పంపేందుకు కంపెనీ భావిస్తోందని సమాచారం.
ఇటీవల రిలయన్స్ రిటైల్ మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 2,850 కోట్లు. అంతేకాకుండా మెట్రో కంపెనీ తమ 3,500 మంది ఉద్యోగులను కూడా తొలగించింది. అయితే, కొనుగోలు తర్వాత రిలయన్స్ రిటైల్‌లో ఉద్యోగాల సంఖ్య పెరిగాయి. ఖర్చు నియంత్రణ, నష్టాల తగ్గింపును దృష్టిలో ఉంచుకుని కంపెనీ భారీ సంఖ్యలో లేఆఫ్స్ చేపట్టాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పలు నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ తన 15,000 మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వనుంది. అందులో భాగంగానే ఇటీవల వెయ్యి మందిని తీసేసింది. మరో రౌండ్‌లో 9 వేల మందిని తీసేయనుంది. అంతేకాకుండా ఖర్చులను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది.