Reliance Retail: టాప్ 100 ప్రైవేట్ సంస్థల్లో రిలయన్స్ రిటైల్ 7వ స్థానం

by S Gopi |

రిలయన్స్ రిటైల్ 'పోస్ట్-మనీ వాల్యుయేషన్' 100 బిలియన్​ డాలర్లను దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఏడు కంపెనీల గ్రూపు హెక్టాకార్న్స్‌లో చేరింది.

Reliance Retail: టాప్ 100 ప్రైవేట్ సంస్థల్లో రిలయన్స్ రిటైల్ 7వ స్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీల జాబితాలో రిలయన్స్ రిటైల్ ఏడో స్థానంలో నిలిచింది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ ప్రకారం, 100 బిలియన్​ డాలర్ల(రూ. 9.24 లక్షల కోట్ల)కు పైగా విలువతో రిలయన్స్ రిటైల్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ 'పోస్ట్-మనీ వాల్యుయేషన్' 100 బిలియన్​ డాలర్లను దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఏడు కంపెనీల గ్రూపు హెక్టాకార్న్స్‌లో చేరింది. టాప్-7లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక కంపెనీ రిలయన్స్ రిటైల్ కావడం విశేషం. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, జీఐసీ, టీపీజీ, కేకేఆర్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు నిర్ణయించిన విలువ ద్వారానే ర్యాంకింగ్స్ కేటాయించారు. రిలయన్స్ రిటైల్‌తో పాటు, భారత్‌కు చెందిన మరో రెండు కంపెనీలు వెంచర్ క్యాపిటల్ మద్దతున్న టాప్-100 జాబితాలో ఉన్నాయి. 24 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో ఎన్ఎస్ఈ ఇండియా 27వ స్థానం, 9 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో టాటా ఈవీ 93వ స్థానంలో ఉన్నాయి.

Next Story