- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance Jio: జియో 5జీ యూజర్లకు ఉచితంగా జెమిని 3 యాక్సెస్
ఈ ఆఫర్ బుధవారం నుంచే 5జీ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన 5జీ కస్టమర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కంపెనీ తన యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను నదుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, దీన్ని మరింత విస్తరిస్తూ, జెమిని 3 మోడల్‌ను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ బుధవారం(నవంబర్ 19) నుంచే 5జీ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదట ఉచిత గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌ను 18-25 వయస్సు ఉన్న జియో వినియోగదారులకు పరిమితం చేసింది. ఇప్పుడు తాజాగా గూగుల్, జియో భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత జెమిని 3కి మారడం మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ కానుంది. 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ సమయంలో జియో యూజర్లు ఏఐ ప్రో ప్లా కింద గూగుల్ అందించే అప్‌డేట్, ఇతర ఫీచర్లను ఆటోమేట్ పద్దతిలో యాక్సెస్ పొందుతారు. రూ. 35,100 విలువైన ఈ ప్లాన్ కోసం కస్టమర్ల్కు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివేట్ చేసుకునేందుకు మైజియో యాప్‌లో క్లెయిమ్ నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది.






