Reliance Industries: వెనిజులా చమురు కొనేందుకు సిద్ధం: రిలయన్స్ ఇండస్ట్రీస్

by S Gopi |

అమ్మకాలకు అనుమతిస్తే వెనిజులా చమురును కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

Reliance Industries: వెనిజులా చమురు కొనేందుకు సిద్ధం: రిలయన్స్ ఇండస్ట్రీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనిజులా చమురు కొనుగోలును తిరిగి ప్రారంభించాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది. అమ్మకాలకు అనుమతిస్తే వెనిజులా చమురును కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాయేతర కొనుగోలుదారులకు విక్రయించడానికి అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటే కొంటామని తెలిపింది. ఒప్పందాలు చేసుకునే ముందు పరిస్థితులను గమనిస్తున్నామని, స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తెలిపారు. అమెరికాయేతర కొనుగోలుదారులకు వెనిజులా చమురు యాక్సెస్‌పై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. వెనిజులా ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం అమెరికా సుంకం విధించిన తర్వాత రిలయన్స్ సంస్థ 2025, మార్చిలో ఆ దేశ చమురు కొనుగోలును నిలిపివేసింది. రిలయన్స్ వెనిజులా చమురును చివరిగా 2025 మేలో రవాణా చేసింది. ఇటీవల వెనిజులా దేశాధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత, ఆ దేశంలోని చమురుపై నియంత్రణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆ దేశ చమురు కొనుగోలు నిబంధనలు మారాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ సంస్థ తాజా ప్రకటన చేసింది.

Next Story